ఉత్తీర్నత వంద శాతం...

అక్షరవిజన్ న్యూస్ ప్రత్యేకం. జడ్చర్ల.. సీబీఎస్ఈ  పదవ తరగతి రిజల్స్ వచ్చిన సందర్భంగా నగరం లో వున్న  శ్రీస్వామినారాయణ్ గురుకుల పాఠశాలలో విద్యార్ధులకు  పలువురు స్వామీజిలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా  పాఠశాల  హెచ్ ఓ డి  శ్రీ అక్షర్ భగత్ జీ అక్షరవిజన్ న్యూస్ తో మాట్లాడుతూ భగవాన్  శ్రీ స్వామి నారాయణ్ ఆశీసుల తో మరియు ఉపాధ్యాయులు కృషి ఫలితంగా  తమ పాఠశాల లో పదవ తరగతి చదివిన విద్యార్థులు వంద శాతం ఉత్తీర్నత సాధించారు అని పేర్కొన్నారు. తమ పాఠశాల లో అభిషేక్ నారాయణ్ కి 485/500, నికేత్మిష్ర 483/500 అత్యధిక మార్కులు వచ్చాయి అని తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీ భావేష్, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ  శ్రీదర్ బాబు, వుప ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రాఘవాదిత్య మరియు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Comments