మమ్మల్ని కాపాడండి మహాప్రభో...


 అక్షరవిజన్ న్యూస్-: ఇంట్లో ఉన్న నగనట్రా అన్ని అమ్ముకొని హోటల్ బిజినెస్ పెట్టుకున్న మాకు మానసికంగా హింసిస్తూ హోటల్ని కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నాడని, సదరు వ్యక్తి వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయాడు ముల్బాగ్ హోటల్ యజమాని మౌర్య. మూడు సంవత్సరాల క్రితం 2,40,000 అడ్వాన్స్గా ఇచ్చి దోస పాయింట్ ఓపెన్ చేసిన తమకు స్థల యజమాని అంటూ మమ్మల్ని చిత్రహింసలకి గురి చేస్తూ వ్యాపారం జరిగే సమయంలో ఒక పెద్ద చెక్కబడ్డిని తమ హోటల్ ప్రాంగణంలో నిలిపి వచ్చే కస్టమర్లను బెదిరిస్తూ మారనాయుధాలను హోటల్ ముందు పెట్టి అపరిచిత వ్యక్తులతో హోటల్లో పనిచేస్తున్న సిబ్బందిపై అలాగే తన భార్యపై చెప్పుకోలేని భాషలో దూషిస్తూ వ్యాపారాన్ని పాడు చేసే విధంగా ప్రయత్నిస్తున్నాడు కొండ జనార్దన్ రావు. కొండా జనార్దన్ రావు అతని భార్య వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని ఇప్పటికే పలుమార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసు అధికారుల యొక్క మాటలను బేఖాతారం చేస్తూ నన్ను నా కుటుంబాన్ని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు. మీడియా మిత్రులందరికీ ప్రయత్నం చేయాలని ఎంతో కష్టపడి పెట్టుకున్న ఈ హోటల్ ని కబ్జా చేసి తమ స్వాధీన పరుచుకుందామని ప్రయత్నం చేస్తున్నారని ఎటువంటి రెంటల్ అగ్రిమెంటు ఇవ్వకుండా అడ్వాన్సుగా భారీగా సొమ్ము తీసుకొని తాము వైసిపి నాయకులు మని మేము ఎవరినైనా మేనేజ్ చేస్తామని అర్ధరాత్రిలు సిసి ఫుటేజ్ కరెంటు తీసేసి తమ హోటల్ ని ధ్వంసం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని ఇందుకు పోలీసు వారు విశాఖ ఉన్నత అధికారులు తమను తమకే రక్షణ కల్పించాలని కోరారు.

 రిపోర్టర్ -: రాజు

Comments