భీమిలి లో కూటమి గెలుపు కొరకు నా సాయశక్తుల కృషి చేస్తా... పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ్. 

అక్షరవిజన్ న్యూస్ -: జీవీఎంసీ ఆరో వార్డు పరిధి వైభవ్ ఫంక్షన్ హాల్ సమీపంలో మంగళవారం నాడు భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ భరత్ నేతృత్వంలో టిడిపిలో భారీగా చేరికలు జరిగాయి. పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ్ ఆధ్వర్యంలో ఆరో వార్డు ప్రాంతానికి చెందిన గాయత్రి నగర్, బి టు కాలనీ, ఆర్ హెచ్ కాలనీ ప్రాంతానికి చెందిన సుమారు 500కు పైగా అభిమానులు వైసీపీ పార్టీని వీడి టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా    గంటా శ్రీనివాసరావు, శ్రీ భరత్ చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి విజయం కుటమిదేనంటూ భీమిలిలో కూటమి అభ్యర్థి గంటా  శ్రీనివాసరావు , విశాఖ జిల్లా పార్లమెంటు అభ్యర్థి శ్రీ భరత్ లను ఆరో వార్డు తరఫున అత్యధిక ఓట్లు సైకిల్ గుర్తుపై వేయించి విజయానికి తనవంతు కృషి చేస్తానని గరే గురునాథ్ అన్నారు. ఈ కార్య క్రమంలో టిడిపి భీమిలి ఇన్చార్జి కోరాడ రాజబాబు,జనసేన నాయకులు ఈఎన్ఎస్ చందర్రావు, ఆరో వార్డు టిడిపి అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, జానసేనా అధ్యక్షుడు సంతోష్ నాయుడు,బిసి సెల్ అధ్యక్షులు రెడ్డి సత్యనారాయణ,లొడగల జానకి రామ్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ :- రాజు

Comments