మొక్కులు చెల్లించుకున్న అభిమానులు


  అక్షరవిజన్ న్యూస్ -:  విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డ్ నాయకులు బొగ్గు శ్యామ్ దంపతులు, పవన్ కళ్యాణ్  మరియు వంశీకృష్ణ శ్రీనివాసరావు mla లు గా గెలుపొందితే శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి మరియు శ్రీ ఎర్నిమాంబ అమ్మవారికి మొక్కుకున్నారు . ఈ సందర్భంగా బొగ్గు శ్యామ్ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. దీంట్లో భాగంగా పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు,  కార్యకర్తలు మరియు అభిమానులు  గజామాల తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ తన విజయం కోసం పనిచేసిన బొగ్గు శ్యామ్ కి మరియ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరికి ఎప్పటికి రుణపడి ఉంటాను అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అందరితో కలిసి భోజనం చేసి కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో   కొర్పొరేటర్లు, బీశెట్టి వసంత లక్మి, కందుల నాగరాజు , POC శివ ప్రసాద్ రెడ్డి , అధ్యక్షులు లెంక త్రినాధ్, టీడీపీ అధ్యక్షులు బొచ్చా రాము రెడ్డి, మాజీ కొర్పొరేటర్లు గుల్లిపల్లి ఆనంద్ రావు, పిల్లి వరలక్ష్మి, బుద్దాల అనురాధ, సీనియర్ నాయకులు జనప్రియ వేణు గారు,పిల్లి రమణా, మాన్యాల శ్రీను, గోపీ కృష్ణ , కడవల రఘు, గుణాజి,గాజుల శ్రీను , బొందల శ్రీను, నారా నాగేశ్వరరావు, జగన్, తిరుపతిరావు, వివిధ వార్డ్ అధ్యక్షులు నాయకులు మర టీడీపీ, జనసేన కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 రిపోర్టర్:- శివ

Comments