వసుదైక కుటుంబాలకు నిలయం భారతదేశం...  

                                             - గరికిపాటి నరసింహారావు.


మద్దిలపాలెం ( విశాఖ తూర్పు) అక్షరవిజన్ న్యూస్ :- విశాఖ మ్యూజిక్ - డ్యాన్స్ అకాడెమీ ఆధ్వర్యంలో పిఠాపురం కాలనీ కళాభారతిలో గురువారం ' కార్తీక దీపం - కాశీ ఖండం' అంశం పై మూడో రోజు ప్రవచన కర్త పద్మశ్రీ గరికిపాటి నరసింహరావు ప్రవచనాలు చేశారు. మానవ జీవితంలో ఎత్తు పల్లాలు సహజం అన్నారు. మనం చేసిన ఖర్మ మన వద్దకే వస్తుంది. పీడకలలు వస్తె కొన్ని పాపాలు పోయినట్టు భావించాలి. వసుదైక కుటుంబం కి నిలయం భారత దేశం అని పేర్కొన్నారు. దీపావళికి చైనా బానసంచ కొనక పోవడం వల్ల లక్ష కోట్ల నష్టం వాటిల్లినట్టు చైనా ప్రకటించిందని గుర్తు చేశారు. సంతాన వాత్సల్యం వల్లనే లోకంలో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి.  పేకాట, కోడి పందాలు వంటి వ్యసనాలకు యువత దూరంగా వుండాలి. దైవ దర్శనం తో మనిషి చేసిన పాపాలు పోవు అని స్పష్టం చేశారు. మనసుని ప్రతిక్షణం పరిశీలించి చూసుకోవాలి. పెళ్లికి ముందు శారీరక సంభంధాలు వుండడం వల్లనే పెళ్లి తరువాత విడాకులు వంటి అనర్ధాలు కలుగుతాయి అన్నారు. డబ్బు పెరిగితే శత్రువు పెరిగినట్టు భావించాలి. రాజుల కాలంలో ఉద్యోగం కారణంగా నే బ్రాహ్మణుల్లో వైదికులు, నియోగులు పేరిట రెండు వర్గాలు వచ్చాయి అని గుర్తు చేశారు. సంస్కృతం నుంచి తెలుగు భాష సుసంపన్నం అయ్యింది. ఇప్పుడు ఇంగ్లీష్ భాష మోజులో తెలుగు మరచి పోతున్నారు అని విచారం వ్యక్తం చేశారు. తూర్పు ఇంట్లో ఉదయ కాంతులు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. దీపారాధన తరువాతనే పూజలు చేసుకోవాలి. పిల్లలకు తల్లిదండ్రులు తగిన సమయం కేటాయించాలి. పిల్లలకు తల్లిదండ్రులే పార్వతి, పరమేశ్వరులు అన్నారు. వున్న సంపదలో పేదలకు దానాలు చేయాలి. హంస లాంటి దేశంలో హింస పెరుగుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుతో పాటు సంస్కారం కూడా వుండాలి. యక్ష దత్తుడు, సోమియమ్మ, గుణనిధి కుటుంబం చరిత్ర ద్వారా ఇల్లాలి బాధ్యతలను వివరించారు. ఈ కార్యక్రమంలో వి ఎం డి ఎ అధ్యక్షుడు ఎం.ఎస్.ఎన్.రాజు, కార్యదర్శి డాక్టర్ జీ ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు), ట్రస్టీ లు పైడా కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

బ్యూరో చీఫ్ -: డి ఎస్ ఎన్ మూర్తి..

Comments