సీతంరాజు సుధాకర్ కు విశాఖ దక్షిణ టికెట్ ఇవ్వాలి..        

                           విశాఖ  కేంద్ర బ్రాహ్మణ ఐక్య వేదిక   అక్షరవిజన్ న్యూస్, విశాఖపట్నం : రానున్న ఎన్నికల్లో సీతంరాజు సుధాకర్ కు విశాఖ దక్షిణ టికెట్ ఇవ్వాలని విశాఖ కేంద్ర బ్రాహ్మణ ఐక్య వేదిక ఏకగ్రీవ తీర్మానం  చేసింది. సోమవారం విశాఖ లో విశాఖ కేంద్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సమైఖ్య సంఘం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్వాహక కమిటీ ప్రతినిధులు సోమయాజులు విజయ్ కుమార్ శర్మ, శివ గణేష్, సుశీల మాట్లాడుతూ విశాఖ దక్షిణం నియోజక వర్గంలో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారని, గత కొన్నేళ్ల నుంచి ఈ నియోజక వర్గం బ్రాహ్మణులకు కేటాయించారన్నారు. సమైఖ్య సంఘం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మిత్ర బ్రాహ్మణ సంఘాలతో ఆత్మీయ కలయిక జరిగిందన్నారు. అర్చక , పురోహితుల సమస్యలు , పరిష్కారం కోసం ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు.భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై జరుగుతున్నటువంటి విషయంపై మాట్లాడుతూ  ఏ పార్టీ అయినా మా బ్రాహ్మణ నాయకులకు పార్టీ టికెట్టు ఇచ్చినట్టు అయితే వారిని  గెలిపించు కొనుటకు తీర్మానం చేశా మన్నారు.బ్రాహ్మణ సంఘంలతో ఆత్మీయ కలయిక తో పాటూ ఆర్చక , పురోహితుల , బ్రాహ్మణ ఉద్యోగుల , వేద బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం కోసం సలహ , సూచనలు చేశారు.ప్రత్యేకించి పరిష్కార దిశగా భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై జరుగుతున్నటు వంటి విషయం పై విశ్లేషణ మరియు  మిత్ర బ్రాహ్మణ సంఘాలు కలిసి ఏ రాజకీయ పార్టీ అయినా మా బ్రాహ్మణ నాయకులకు పార్టీ టికెట్టు ఇచ్చినట్టు అయితే వారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తామన్నారు. బ్రాహ్మణ అభ్యున్నతికి పరిష్కారమార్గములు చర్చించుకోవడం గురించి బందుమిత్రులతో ఈ మహోత్సవం నిర్వహించడం జరుగుచున్నది .ఇందులో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర మఠం మందిర టోలి పూడి పెద్ది శర్మ , చంద్రశేఖర్ ,  తారానాత్ ,  నాగశాస్త్రి శివాచార్య , సోమయాజుల విజయ కుమార్ శర్మ , కైలాసపతి శివాచార్య , J. P. S కిషోర్ , R. రమణ మూర్తి , A. సూర్యప్రకాష్ శర్మ , Y. వెంకట అశోక్ కుమార్ , V. సాయి గణేష్, S. రాంప్రసాద్ , M. సంతోష్ , శ్రావన్ , A. సాయి ప్రమోద్ , A. రాజేష్ , ఇతర మిత్ర బ్రాహ్మణ సంఘ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.


బ్యూరో చీఫ్ :- డి ఎస్ ఎన్ 
Comments