ఆత్మీయ కలయిక

 పూర్వ విద్యార్ధుల ఆత్మీయ కలయిక 

    అక్షరవిజన్ న్యూస్-: అనకాపల్లి జిల్లా, వేములపూడి గ్రామం -: 1986-87 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం ఘనంగా జరిగింది. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అప్పటి హైస్కూల్ భూదాత బెన్నయ్య శెట్టి మాట్లాడుతూ తమ గ్రామంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలతో పాటుగా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సూచించారు.ఈ సందర్భంగా అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు వెంకట జోగయ్య మరియు ఉపాధ్యాయులు అమీర్ సాహెబ్, కాశీ శ్రీనివాసరావు, వైవి రమణ ,పాఠశాల ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులు మోహనరావు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పలు దూర ప్రాంతాల నుండి సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొని ఒకరినొకరు ఆప్యాయంగా  పలకరించుకోవడం గ్రామ ప్రజలును విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణజీ, సూర్యనారాయణమూర్తి , భీమయ్య, అప్పలనాయుడు,వైదేహి, రజిని తదితర విద్యార్థులు పాల్గొని అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

బ్యూరో చీఫ్ :- డీ ఎస్ ఎన్ మూర్తి.

Comments