ఘన విజయం

 అక్షరవిజన్ న్యూస్..  15వ రాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీమతి ద్రౌపది ముర్ము ఘన విజయం. మిడ్జిల్ బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి దగడ్ శివ ఆధ్వర్యంలో సంబరాలు.భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి శ్రీమతి ద్రౌపతి ముర్ము అఖండ విజయం సాధించిన సందర్భంగా  బీజేవైఎం మండల  శాఖ ఆధ్వర్యంలో మిడ్జిల్  చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి మాట్లాడుతూ ఒక ఆదివాసుల ముద్దుబిడ్డ గిరిజన మహిళకు ఈరోజు బిజెపి భారత అత్యున్నత స్థానం కల్పించడం జరిగిందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ నిదానంతో దేశంలోని అన్ని కులాలకు వర్గాలకు సముచిత స్థానాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు మొదటగా ఒక మైనార్టీని రాష్ట్రపతిగా చేశారు నరేంద్ర మోడీ గారు  ప్రధానమంత్రి అయిన తర్వాత దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఎస్సీ ని రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత బిజెపికి దక్కిందని ఇప్పుడు గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఆదివాసుల ముద్దుబిడ్డ అయినా మహిళని రాష్ట్రపతిగా చేయడం యావత్ భారత దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేసి బడుగు జాతుల పక్షాన నిలిచింది అన్నారు  అదే కాకుండా అన్ని కులాల మతాలకు నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అన్న మాట ప్రకారంగా వర్గీకరణ కూడా రాబోయే రెండు మూడు నెలల్లో దళితుల ఆకాంక్షలకు అనుగుణంగా జరగబోతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కుమార్ గౌడ్ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి ప్రభాకర్ గౌడ్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి లాలు దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి బండి భాస్కర్ బీజేవైఎం నాయకులు బాదం నరేష్ రామకృష్ణ నరేష్ ప్రశాంత్ బాబు గణేష్ శేఖర్ అరవింద్ గణేష్ కిట్టు చింటూ తదితరులు పాల్గొన్నారు.

Comments