అధికారులు హెచ్చిరిక..

అక్షరవిజన్ న్యూస్..  నేషనల్.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు, అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా కొందరు సముద్రాలు, నదుల వద్ద ఎంజాయ్‌ చేస్తున్నారు.వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రదేశాల్లో ఉండటం ఎంత ప్రమాదకరమో ఈ వీడియోనే చెబుతోంది. ఐపీఎస్‌ అధికారిణి షిఖా గోయెల్‌ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వీడియోలో కొందరు సముద్రం ఒడ్డున​ అలలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలో ఓ పెద్ద కెరటం వచ్చి అక్కడున్న వారిని సముద్రంలోకి లాకెళ్లింది. అప్పుడు వారిని ఎవరూ కాపాడలేకపోయారు.

కాగా, ఈ వీడియోకు షిఖా గోయెల్‌.. ‘‘జాగ్రత్తగా ఉండటం కంటే ధైర్యంగా తప్పు చేయడం మంచిది . గొప్ప పశ్చాత్తాపం కంటే కొంచెం జాగ్రత్త మంచిది. ముఖ్యంగా ఇప్పుడు, తీవ్రమైన వర్షపాతం హెచ్చరికల దృష్ట్యా దయచేసి జాగ్రత్తగా ఉండండి’’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే, ఈ ఘటన ఒమాన్‌ దేశంలో చోటుచేసుకుంది. సలాలహ్‌ హల్‌ ముగుసెల్‌ బీచ్‌లో 8 మంది భారతీయులు.. కెరటాల్లో కొట్టుకుపోగా.. ముగ్గురిని రక్షించారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. అయితే, వారంతా సెఫ్టీ ఫెన్నింగ్‌ దాటిన కారణంగానే  ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

Comments