డిగ్రీ, పిజి కోర్సులలో ప్రవేశం
అక్షరవిజన్ న్యూస్ -: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్ ద్వారా నిర్వహిస్తున్న డిగ్రీ, పిజి కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 14వ తేదీన గీతం అడ్మిషన్ టెస్ట్ (గ్యాట్) నిర్వహిస్తున్నట్లు స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కృష్ణ, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వేదవతి తెలిపారు. శనివారం తేది: 06-07-2024న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవేశ పరీక్షకు సంబందించిన వివరాలను తెలియజేశారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ద్వారా బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విత్ కాగ్నిటివ్ సిస్టమ్స్, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, మేథ్స్, స్టాటిస్టిక్స్, ఫుడ్సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్లలో 4 సంవత్సరాల బిఎస్సీ (ఆనర్స్) కోర్సులు, 3సంవత్సరాల బిసిఎ కోర్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే అప్లైడ్ మేథ్స్, బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ, డేటా సైన్స్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, ఫుడ్సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్లలో 2 సంవత్సరాల ఎమ్మెస్సీ కోర్సులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసిఎ) కోర్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా బిఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కోర్సులలో ప్రవేశానికి జులై 12వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని, వివరాల కోసం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా సూచించారు. గ్యాట్ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోదలచిన వారు గీతం వెబ్ సైట్ను పరిశీలించవచ్చునన్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రభుత్వ ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారు, క్యూట్, జేఇఇ వంటి జాతీయ స్థాయి పరీక్షలలో ఉత్తీర్ణత పొందిన వారు తమ ర్యాంక్ కార్డులతో నేరుగా ప్రవేశాలు పొందవచ్చునని సూచించారు. ప్రతిభ గల విద్యార్థులకు గీతం స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు వెల్లడించారు. అధునాతన ప్రయోగశాలలపై డిగ్రీ, పిజి విద్యార్థులకు శిక్షణ నూతన విద్యా విధానంలో భాగంగా నిర్వహిస్తున్న 4 సంవత్సరాల బిఎస్సీ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారు నేరుగా పి.హెచ్.డి కోసం ధరఖాస్తు చేసుకోవచ్చునని డీన్ ప్రొఫెసర్ కృష్ణ తెలిపారు. డిగ్రీ కోర్సు నుంచి నేరుగా పరిశోధక విద్యార్ధిగా మారే క్రమంలో విద్యార్థులకు అత్యున్నత ప్రయోగశాలలో పని చేసే అనుభవం ఉపయోగడుతుందని ఈ కారణంగా గీతంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రత్యేక ప్రయోగశాలలు నెలకొల్పామన్నారు. అలాగే సెంట్రల్ రీసెర్చి ల్యాబ్స్, మూర్తి ల్యాబ్స్ వంటివి విద్యార్థులకు అంతర్జాతీయ పరిశోధనశాలలపై అవగాహన పెంచుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. గీతం నిర్వహిస్తున్న సైన్స్ కోర్సులను విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు.
రిపోర్టర్ -: రాజు