రామనవమి వేడుకల్లో భాగంగా 37 వార్డులో భారీ అన్న సమారాధన                     

'' భక్తులకు వడ్డించి అన్నసంతర్పణ ప్రారంభించిన సనపల రవీంద్ర భరత్''

విశాఖపట్నం అక్షరవిజన్ న్యూస్ : 37 వార్డు పెయిందోర పేట వద్ద గల శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో  ఎంతో ఘనంగా నిర్వహించారు. శ్రీ రామనవమి వేడుకలలో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసినటువంటి భారీ అన్న సమారాధన సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సనపల రవీంద్ర భారత్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సెక్రటరి చింతపల్లి శంకర్రావు, ప్రముఖ సంఘ సేవకులు చింతపల్లి పోతురాజు, కమిటీ సభ్యులు చింతపల్లి నూకరాజు, గాయత్రి పాఠశాల ప్రిన్సిపాల్ కనకరాజు, పట్నాల వరప్రశాద్, శ్ర‌ీను తదితరులు పాల్గొన్నారు.

 బ్యూరో చీఫ్ :- డి ఎస్ ఎన్ మూర్తి 

Comments