దిశా దివ్యాంగ సురక్ష అవగాహన సదస్సు*


 *దిశా దివ్యాంగ్ సురక్ష అవగాహన సదస్సు*

అక్షరవిజన్ న్యూస్  -:  డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు మరియు కే.ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్., జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ కి చెందిన సుమారు 300 మంది దివ్యాంగులతో నగర పోలీస్ మీటింగ్ హల్ నందు సమావేశం నిర్వహించి,దిశా దివ్యాంగ సురక్ష (DDS) హెల్ప్ లైన్ వినియోగంపై అవగాహన కల్పించి, ఆపదలో ఉన్నప్పుడు వీడియో కాల్ లేదా వీడియో సందేశం ద్వారా కంట్రోల్ రూంకి తెలియపరిచినట్లయితే, తక్షణమే లోకల్ పోలీసులను అప్రమత్తం చేసి, బాధితులకు తగిన రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.అనంతరం కొందరు దివ్యాంగులు, వారి సమస్యలను సీపీ గారికి తెలియజేయగా, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దిశ దివ్యాంగ్ సురక్ష టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వారికి భద్రత మరియు భరోసా కల్పిస్తున్నందున సీపీ గారికి వారంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

బ్యూరో చీఫ్ :- డి ఎస్ ఎన్ మూర్తి

Comments