*ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు*

*లక్కీడిప్, సీనియర్లకు సత్కారం*

 అక్షరవిజన్ న్యూస్  -: డైమండ్ పార్క్ , ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్లు సంయుక్తంగా ఏప్రిల్ 7న ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి.నారాయణ్ లు తెలిపారు. మంగళవారం డైమండ్ పార్కు సమీపంలోని ఒక ప్రయివేట్ హోటల్ లో అర్బన్ యూనిట్ కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చేస్తున్న ఏర్పాట్లపై సభ్యులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనుబాబు, నారాయణ్ లు పాత్రికేయులతో మాట్లాడుతూ ఏప్రిల్ 7న ఆదివారం ఉదయం 9 గంటలకు నగరంలోని సింకా గ్రాండ్ లో ఉగాది సంబరాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తదుపరి నిష్ణాతులైన పండితులచే కవిసమ్మేళనం, పంచాంగశ్రవణం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తదుపరి పండితులను , పలువురు సీనియర్ జర్నలిస్టులను సత్కరించడం జరుగుతుందన్నారు. అతిధల ప్రసంగాలు అనంతరం  పంచాంగం పుస్తకాలను అందజేస్తామన్నారు. మధ్యాహ్నం విందుభోజనం వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలుతో పాటు లక్కీడిప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. దసరా పండుగను అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించామని, అదే రీతిన ఉగాది సంబరాలను భారీ ఎత్తున నిర్వహిస్తామన్నారు. కావున ఆయా కార్యక్రమాల్లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ యూనియన్ లు నిరంతరం పాటుపడుతున్నాయన్నారు. తమ సభ్యుల సంక్షేమమే ప్రధానమన్నారు. ఈ సమావేశంలో జాతీయ కార్య వర్గ సభ్యులు జి. శ్రీనివాస రావు,ఏపి బ్రాడ్ కాస్ట్ అర్బన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, జిల్లా ఉపాద్యక్షులు కె. మురళీ కృష్ణ,చింతా ప్రభాకర్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

బ్యూరో చీఫ్ -: డిఎస్ఎన్ మూర్తి

Comments