భాష తో పాటు భావమూ ముఖ్యమే...


అమెరికన్ ఇంగ్లీష్ శైలిలో ఉచితశిక్షణ ముగింపు కార్యక్రమం లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేత..

భాషతో పాటు భావం ముఖ్యం అని లెగ్జిగ్రాఫర్-విఎస్డి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ రచయిత సనపల జీవన్ కుమార్ అన్నారు. అమెరికన్ శైలి మెళకువలతొ తెలుగు వారూ టాప్ లొ నిలవొచ్చు అని ఆయన పేర్కొన్నారు.  మాతృభాషతోనూ దబెస్ట్  గా నిలవొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.  -లెగ్జిగ్రాఫర్-విఎస్డి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ రచయిత సనపల జీవన్ కుమార్ నగరంలోని 36 ఏళ్లుగ నడుస్తున్న తన్మయి క్రియేటివ్స్ సాంస్కృతిక సంస్థ ప్రత్యేకం అమెరికన్ ఇంగ్లీషుభాష శైలికి సంబంధించి శిక్షణ రెండవ రోజు చేపట్టారు. ఈ సందర్భంగ  భాషతో పాటు భావం ముఖ్యం అని చెప్పారు.  ఇంగ్లీష్ శైలి మెళకువలతొ తెలుగు వారూ టాప్ లొ మాతృభాషలోనూ అత్యుత్తమంగ నిలవొచ్చునన్నారు. అమెరికన్ ఇంగ్లీష్ శైలి, భాష ఉచ్ఛారణ, రాయడంలోనూ మాట్లాడడం లొ ఉండే వ్యత్యాసం తదితర అంశాలను ప్రస్థావించారు.  సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిన తరుణంలో ఆంగ్లభాష మరీ ముఖ్యంగా అమెరికన్ శైళి అవసరం ఎంతో ఉందని అన్నారు.  36 ఏళ్లుగ నడుస్తున్న సాంస్కృతిక సంస్థ తన్మయి క్రియేటివ్స్ శనివారం ద్వారకానగర్ పౌర గ్రంధాలయము రెండు రోజుల అమెరికన్ ఇంగ్లీష్ శైలిలో ఉచిత శిక్షణ కార్యక్రమం  2వ రోజు కార్యక్రమంలొ  అమెరికన్ ఇంగ్లీష్ ప్ధాధాన్యత వివరించి ప్రాక్టికల్ గ అమెరికన్ ఇంగ్లీష్ కు సంబంధించిన కొన్ని పదాల వాడకం తీరు తెన్నులు విశ్లేషించారు. తన్మయి క్రియేటివ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, అక్షరసారధి బిఎస్ చంద్రశేఖర్ స్వాగత ఉపన్యాసం చేసిన కార్యక్రమంలొ సీనియర్ క్రీడా జర్నలిస్టు, పర్వతారోహకులు నాగనబోయిన నాగేశ్వరరావు, తన్మయి క్రియేటివ్స్ కార్యదర్శి సీహెచ్వి సత్యనారాయణ,  కొణతాల రాజు , గ్రంధి సతీష్ కుమార్, ఉప్పాడ రఘు, ఆధ్యాత్మిక వేత్త ఎంవి రాజశేఖర్ లు మాట్లాడారు. కార్యక్రమ సమన్వయకర్త బాదంగీర్ సాయి మాట్లాడుతూ..ఇంగ్లీష్ భాషకు అమెరికన్ వాడుక భాషతో కూడిన సోదాహరణ అంశాల సహితం జీవన్ కుమార్ పేర్కొనడం ప్రశంసనీయం అన్నారు.  సీనియర్ జర్నలిస్టు, లెగ్జిగ్రాఫర్ గ జీవన్ కుమార్ ప్రసంగం వంటి కార్యక్రమాలు  భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లను కూడా అందజేశారు. డి.సి.డిజిటల్స్ సునీల్, సనపల రూపేష్ కుమార్, వియ్యపు రామకృష్ణ, యస్.దుర్గారావు తదితరులు నిర్వహణలో సహకరించారు.

బ్యూరో చీఫ్:- డి ఎస్ ఎన్.

Comments