*ఐహెచ్ఆర్సి మీడియా కార్యదర్శిగా రాజశేఖర్*  
   

 వేపగుంట, అక్షరవిజన్:- న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన ఇండో హ్యూమన్ రైట్స్ కేర్ సంస్థకి సంబంధించి విశాఖ జిల్లా మీడియా కార్యదర్శిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎం వి రాజశేఖర్ని నియమించారు. వేపగుంటలో ఉన్నటువంటి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వీరిని సభ్యులకు పరిచయం చేసి తదుపరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఉపరిజిస్టర్ డాక్టర్ పి వి ఎస్ ఎన్ వి సాంబమూర్తి గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ పదవిలో వీరు 2023 నుండి 2024 మార్చ్ నెలాఖరు వరకు సంవత్సరకాలం పాటు కొనసాగుతారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం సంస్థ నిర్వహించే సేవా కార్యక్రమాలకు వీటితోపాటు ముఖ్యంగా మీడియా విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తారు. కార్యక్రమంలో ఐహెచ్ఆర్సి జాతీయ చైర్మన్ ఆర్ ప్రసాదరావు , ఐహెచ్ ఆర్సి యూత్ అధ్యక్షులు ఎమ్ సుగుణ కుమార్ వివిధ శాఖల సభ్యులు పాల్గొన్నారు.

బ్యూరో చీఫ్:- డీ. ఎస్. ఎన్.

Comments