జోరుగా వి.జె.ఎఫ్ సభ్యత్వ నమోదు.

ఉత్సాహ వాతావరణంలో కొనసాగిన దరఖాస్తుల స్వీకరణ..


డాబాగార్డెన్స్, అక్షరవిజన్, ఏప్రిల్ 18
-: వైజాగ్ జర్నలిస్టుల ఫోరం రెగ్యులర్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైంది.పెద్ద ఎత్తున సభ్యులు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు.వి.జె.ఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, ఇతర కమిటీ సభ్యులు ఈ దరఖాస్తులను స్వీకరించారు.తొలిరోజు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ దరఖాస్తులను అందజేశారు.ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరుగుతుందన్నారు.ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు.తొలిరోజు సభ్యత్వ రెగ్యులరైజేషన్ అత్యంత ఉత్సాహంగా సాగిందన్నారు.280 పైగా సభ్యులు తొలిరోజు తమ సభ్యత్వం రెగ్యులర్ చేసుకున్నా రన్నారు.ఉత్సాహవంతమైన వాతావరణంలో ఈ రోజు కూడా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. ఈనెల 19 తేదీ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. జర్నలిస్టులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో విజేఎఫ్ కార్యదర్శి దాడి రవికుమార్,వి.జె.ఎఫ్ అవార్డు ల కమిటీ చైర్మన్, ఆర్.నాగరాజ్ పట్నాయక్, సభ్యులు ఎం.ఎస్.ఆర్.ప్రసాద్,ఇరోతి ఈశ్వరరావు,దొండ గిరిబాబు,శేఖర్ మంత్రి. డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.

బ్యూరో చీఫ్ -: డీ.ఎస్.ఎన్.

Comments