*విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులుగా గంట్ల శ్రీనుబాబు*


       *సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తా*

 అక్కయ్య పాలెం,అక్షరవిజన్,ఏప్రిల్ 14:-విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులుగా  గంట్ల శ్రీనుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..సంఘం నాయకులు సినీ డైరెక్టర్ యాద కుమార్,అధ్యక్షులు క్యాలు జనార్ధన్ తదితరుల ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీను బాబు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అక్కయ్య పాలెం సింధూర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో తొలుత జనార్ధన్ ఇతర సంఘం పెద్దలు మాట్లాడుతూ శ్రీ వరహా లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు, అనేక సాంస్కృతిక సంఘాలకు  ప్రోత్సాహాన్ని అందిస్తున్న శ్రీను బాబును సుమారు రెండు వేలకు పైగా కళాకారులున్న విశాఖ కళాకారుల సంక్షేమ సేవాసంఘానికి గౌరవ అధ్యక్షుడుగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. శ్రీనుబాబు సేవలను తాము ఉపయోగించుకుంటామన్నారు.అదేవిధంగా సంఘం నిర్వాహక కార్యదర్శిగా పక్కి అరుణ సాయి కుమార్, (శాస్త్రీయ నృత్య విభాగం) ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా బాలు, విజయ, ఉపాధ్యక్షులుగా తాళ్లపాక సందీప్ లను నూతనంగా నియమించినట్లు తెలియజేశారు.ఈ సందర్భముగా శ్రీనుబాబు మాట్లడుతూ తనకు సాయం చేయడం మాత్రమే తెలుసు నన్నారు.కళాకారులు సంక్షేమము కోసం తన పరిధి మేరకు సేవలు అందించే విధముగా ముందుకు సాగుతానన్నారు. అందరినీ సమన్వయం చేసే ప్రయత్నం చేస్తా అన్నారు.తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న వారికి శ్రీను బాబు ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో కొరియోగ్రాఫర్ గా పేరు పొందిన సీనియర్ జర్నలిస్ట్ ఆర్ .నాగరాజు పట్నాయక్ ,ఈటీవీ ఫేమ్ సంగీత కళాకారులు ధనంజయ్ ,కీరవాణి ప్రసాద్,నంది అవార్డు గ్రహీతలు శివ జ్యోతి, కన్నం వెంకటరమణారావు, డేవిడ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

బ్యూరో చీఫ్:- డీ ఎస్ ఎన్ మూర్తి.Comments