సంక్రాంతి శుభాకాంక్షలు..

 


..సంక్రాంతి శుభాకాంక్షలు..


  అక్షరవిజన్ న్యూస్-:  మధురవాడ  జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వి.జె.ఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబును శుక్రవారం మర్యాద పూర్వకంగా కలసి,సంక్రాంతి,శుభాకాంక్షలు తెలియజేశారు. 

       ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో  నూతన కార్యవర్గ సభ్యుల నుద్దేశించి  శ్రీనుబాబు మాట్లడుతూ జర్నలిస్టు సోదరులు అందరూ ఒక్కటె అని ,సంఘాలు జర్నలిస్టు సంక్షేమం కోసమే ఏర్పాటు చేసుకుంటామని,అందరూ కలసి కట్డుగా వెళ్లాలని సూచించారు.జర్నలిస్టు సంక్షేమానికి  విజెఎఫ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.అదేవిధంగా ఎల్లప్పుడూ నూతనంగా ఏర్పడ్డ మదురవాడ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ కి విజెఎఫ్ తరుపున పూర్తి సహాయ,సహాకారాలు అందిస్తూ అండగా ఉంటానని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కృష్ణ,అనీష్,జానకి రామ్,శ్రీను,చిన్ని,రఘు,రాజేష్,శ్రీను,హరి,రమణ,పృధ్వీ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

రిపోర్టర్-: రాజు

Comments