ఉచిత విద్యా నిలయం స్వర్ణోత్సవములు
  అక్షరవిజన్ న్యూస్ విశాఖపట్నం-:  *ఘనంగా శ్రీరామ పాఠశాల స్వర్ణోత్సవములు*.. సాగర తీరానికి సమీపంలో ఉన్నటువంటి మత్స్యకారులు నివసించే జాలారిపేటలో శ్రీరామ రాత్రి పాఠశాల ఉచిత విద్యా నిలయం స్వర్ణోత్సవములు ఘనంగా జరిగాయి  ముఖ్య అతిథిగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ వంకాయల సన్యాసిరాజు హాజరై పాఠశాల పనితీరును కమిటీ సభ్యులను మరియు పాఠశాలకు నిస్వార్ధమైన సేవలు అందించిన తాతయ్యలు మాస్టర్ని ప్రశంసించారు వీరితో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎం వి రాజశేఖర్ పాఠశాల కమిటీ సభ్యులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వర్ణోత్సవములు సందర్భంగా సాంస్కృతిక క్రీడ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథులు చేతుల మీదుగా బహుమతులను చేశారు పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను సలహాదారులను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు.
Comments