గోదారమ్మ ఉగ్రరూపం..

 అక్షరవిజన్ న్యూస్.. భద్రాద్రి.. రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వానలతో గోదారమ్మ  ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో గంట గంటకు వరద ప్రవాహం పెరిగిపోతున్నది. ఎగువనుంచి భారీగా వరద పోటెత్తడంతో రాములవారి పాదాల వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.భారీగా వరద వస్తుండటంతో భద్రాద్రిలో స్నానఘట్టాల ప్రాంతం నీటమునిగింది. గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదవారి నది ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా, రాత్రి 12 గంటలకు 43 అడుగులు దాటింది. దీంతో అధకారులు మొదటి హెచ్చరిక జారీచేశారు.

Comments