తోలు బొమ్మలాట...

(అక్షరవిజన్ న్యూస్) విశాఖపట్నం-: విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి కళలకు కాణాచి...మన ప్రాచీన కళ లో అతి ముఖ్యమైనవి తోలుబొమ్మలాట ،హరికథ، బుర్రకథ ،నాటకాలు، ఇత్యాదులు .కానీ బొమ్మలాట హరికథ బుర్రకథ ఇలాంటివి మరుగున పడిపోతున్నాయి ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది.కళాకారులు చాలా దీనావస్థలో ఉన్నారు.  పూట గడవడమే కష్టంగా ఉండే స్థితిలు.  దానికితోడు కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ఎక్కడా కార్యక్రమాలు లేక భుక్తి కూడా గడవని స్థితిలో కాలం వెళ్లబుచ్చుతున్నారు.పూర్వకాలంలో భోజనాలు అయిన తర్వాత రాత్రి 9కి గాని 10 గంటలకు గాని ప్రారంభం అయితే తెల్లవారే వరకు ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి.వీటి ద్వారా మంచి కథలను రామాయణ భారత భాగవతాలు నుంచి మంచి సందేశాలను తెలియజేస్తూ ఉండేవారు.కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సాంకేతికత బాగా పెంపొంది. గ్రాఫిక్స్ సిస్టమ్ వచ్చి ఇలాంటి కళలకు అసలు అవకాశమే లేకుండా పోయిoది.కార్యక్రమానికి ముందుగా అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు కార్యదర్శి గుమ్ములూరి రాంబాబు, ఇంజనీరు వేణు, పైడా కృష్ణ ప్రసాద్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి శుభారంభం చేశారు.కార్యదర్శి రాంబాబు కళాకారులను పరిచయం చేస్తూ తోలుబొమ్మలకు తాళ్ళుకర్ర పుల్లలు కట్టి   వాటితో తెర వెనక నుండి బొమ్మలను ఆడించడం చాలా గొప్ప ప్రక్రియని కళాకారుల చేత చేయించి  చూపించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ హనుమంతరావు కుటుంబం మాత్రమే ఈ తోలుబొమ్మలాట కళను కొనసాగిస్తూ జీవనం గడుపుతున్నారన్నారు.తర్వాత తెల్లటి తెర కట్టి తెర వెనుక మూడు లైట్లు పెట్టి మైకులు పట్టుకుని రామ కథను గానం చేస్తూ శ్రీ రాముని జననము సీతమ్మ వారి భూములో దొరకడం, ఘట్టాలను కళ్లకు కట్టినట్టుగా చూపిస్తూ పదహారేళ్ల ప్రాయంలోనే విశ్వామిత్రుడు వచ్చి  రామలక్ష్మణులను వెంట పంపమని అడగడం, దశరథ మహారాజు కృంగిపోవడం, తర్వాత వశిష్టులు వారి ఆదేశాల మేరకు వారిని పంపడం. యాగ రక్షణలో తాటకి సుభాహుల  వధ, రాముని బానాధాటికి మారిచుడు 100 యోజనాల దూరంలో పడడం. అహల్య శాప విమోచనం,శివ ధనుర్భoగం, సిరారాముల కళ్యాణ ఘట్టాలను కడు రమ్యంగా తోలు బొమ్మల ద్వారా చూపించి అందరి మన్ననలు పొందేరు.ప్రేక్షకులు మేచ్చుకొని విరాళాలు ఇచ్చి ధనసాయం అందించేరు.

Comments