నారాయణ తీర్థులు వారి జయంతి..

తొలి ఏకాదశి నాడు జన్మించిన నారాయణతీర్థులు వారు అనేక తరంగాలు రాసి సంగీత ప్రపంచానికి అందించారు.

అక్షరవిజన్ న్యూస్.. కల్చలర్.. విశాఖపట్నం..త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్ విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అంబంధ సంస్థ. కేవలం వాగ్గేయ కారుల జయంతి  వర్ధంతులు నిర్వహించడానికి స్థాపించబడిన సంగీత సంస్థ.జనవరిలో త్యాగరాజ ఆరాధన 6రోజులు పాటు సుమారు 1200 జూనియర్ సీనిర్ కళాకారులు పాల్గొని పండుగ వాతావరణం నెలకొంటుంది.ఫిబ్రవరి లో ముత్తుస్వామి వారి జయంతి, ఫిబ్రవరి లోనే రామదాసు గారి జయంతి, మే నెలలో వారి జయంతి, జులైలో నారాయణ తీర్థుల వారి జయంతి, నవంబర్లో శ్యామశాస్ట్రీ జయంతి  కార్యక్రమాలకు నిష్ణాతులయిన విద్వాన్సులముచే  కచేరిలు నిరహిస్తూ సేవ చేస్తూంది త్యాగరాజ ఆరాధన ట్రస్ట్.నారాయణ తీర్థుల వారి జయంతి సందర్బంగా ఈ రోజు త్యాగరాజ ట్రస్ట్ & నారాయణ తరంగిని ట్రస్ట్ సంయుక్తంగా ప్రముఖ గాత్ర విద్వాన్సులు శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు అనేక తరంగాలను శ్రావ్యంగా పాడి శ్రోతల కారతాల ద్వనులతో మారుమ్రోగిపోయింది. violin పై రాంచరణ్, మృదంగం పై కామేష్, ఘటం పై కౌండిన్య సహకరించి కచేరి స్థాయిని పెంచి రక్తి కట్టించేరు.కార్యదర్శి రాంబాబు, పైడకృష్ణ ప్రసాద్, నరసింగరావు, మోహనదాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Comments