*దాతల సహకారంతోనే దేవాలయాల అభివృద్ధి*

*దాతల సహకారంతోనే దేవాలయాల అభివృద్ధి*

 *అప్పన్న చందన సమర్పణకు లక్ష విరాళం*

*మే 10న సింహాద్రి నాధుడు నిజరూప దర్శనం*.

*ఈవోకు చెక్ అందించిన ధర్మకర్తలి మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు దంపతులు*.

అక్షరవిజన్ న్యూస్ ,సింహాచలం.. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలము శ్రీ వరహాలక్ష్మీనృసింహస్వామి . ఆలయంలో మే 10న అప్పన్న నిజరూప దర్శనం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే చందన సమర్పణకు సంబంధించి అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు దంపతులు శనివారం ఆలయ ఈవో సింగం శ్రీనివాస్ మూర్తిని కలిసి లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దాతల సహకారంతోనే దేవాలయాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయన్నారు.ఇటీవలే సింహగిరిపై చేపట్టిన శ్రీ నారసింహమహో యజ్ఞం పూర్తి స్థాయిలో విజయవంతం కావడానికి దాతల సహకారం కూడా ఎంతో ఉందన్నారు. చందన సమర్పణ కు ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు తొలి విరాళం అంద చేయడం అభినందనీయం అన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతి యేటా చందన సమర్పణకు సంబంధించి తాను లక్ష చొప్పున విరాళంగా అందించడం జరుగుతుందన్నారు. అలాగే గతంలో దేవస్థానం అమలు చేసిన స్వర్ణ తులసీదళాలు, స్వర్ణ పుష్పార్చనకు సంబంధించిన పథకాలకు బంగారము కొనుగోలు కోసం విరాళం అందజేశానన్నారు. అన్నప్రసాదానికి గతములో మూడు లక్షలు విరాళం అందజేసినట్లు చెప్పారు. కవచం కోసం 27 కేజీ లు ఇత్తడి, వివిధ సామాగ్రి ఇవ్వడం జరిగింది అన్నారు.రెండు పర్యాయాలు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా సేవలు అందించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతము గా భావిస్తున్నట్లు శ్రీను బాబు చెప్పారు. సింహాచలం గ్రామంలో జన్మించిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయని,అటువంటి గ్రామంలో జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆలయ స్థానా చార్యులు టీపీ రాజ గోపాల్, ఏఈవో ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు...తొలుత సిరి లొలికించె సింహాద్రి నాధుడు ను శ్రీను బాబు తన కుటుంబ సభ్యులు తో కలిసి దర్శించుకున్నారు..

బ్యూరో చీఫ్ :- డి ఎస్ ఎన్ మూర్తి

Comments