నృత్య పోటీల సంబరం..

 అక్షరవిజన్ న్యూస్.. ఆధ్యాత్మికం/ కల్చ్రలర్..విశాఖపట్నం..  అంబరాన్ని తాకిన  నృత్యపోటీల సంబరం  నాట్యరవళి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న 33వ  నృత్య పోటీలు అంబరాన్ని తాకాయి వివిధ రాష్ట్రాల నుండి కళాకారులు  చిన్నారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వివిధ నృత్యాంశాలతో  తమ కనబరుస్తున్నారు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి  దేవస్థానం మాజీ చైర్మన్ కళాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతీయ సాంప్రదాయ నృత్య కళలకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత నివ్వాలని కోరారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎం వి రాజశేఖర్ మాట్లాడుతూ గెలుపు ఒకటే ప్రాధాన్యత కాదని ఓటమి కూడా గెలుపుకు దారితీస్తుందని గ్రహించాలన్నారు కళలతో పాటు విద్యలోని కూడా రాణించాలని తెలిపారు కార్యక్రమంలో  సంస్థ అధ్యక్షులు ఉమ్మడి మహేష్ బాబు , వెంకట్ , ఇంద్రజ, న్యాయనిర్నేతలు కళాకారులు వారి తల్లిదండ్రులు నాచుగురువులు కళాభిమానులు పాల్గొన్నారు.

Comments