గురుదేవులు ఆశీసులు..

అక్షరవిజన్ న్యూస్..  అగణంపూడి.. గురువు దైవంతో సమానం  🌻 గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎం వి రాజశేఖర్ అగనంపూడి శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు ముందుగా ఆలయ కమిటీ సభ్యులు మంగళధ్వని పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం బాబావారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహింప చేశారు తదుపరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎమ్ వి రాజశేఖర్ బాబా దర్శనానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి గురువుకే ఉందన్నారు గురువు దైవంతో సమానమని తెలిపారు గురువు యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని పొందిన శిష్యుడు ఉన్నత శిఖరాలను పొందటమే కాకుండా ఉత్తమ శిష్యునిగా కీర్తిని లభిస్తుందన్నారు ఈ జీవితం చాలా చిన్నదని ఆత్మ ఉన్నప్పుడే పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని సద్వినియోగ పరచుకోవాలన్నారు  షిరిడి సాయిని నిరంతరం ప్రార్థిస్తూ బాబావారి కృపను పొందాలని సూచించారు అనంతరం ఆలయ అధ్యక్షులు కే రమణారెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతా పూర్వకంగా మంగళధ్వని వేద మంత్రోచ్ఛారణల మధ్య శిరస్సుపై పుష్పాలను పోసి దృశ్యాలువ పూలమాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు 🙏

Comments