విదేశీయులు అక్రమ మార్గం..

 అక్షరవిజన్ న్యూస్.. ఓ ఏజెంట్ ద్వారా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన విదేశీయులు సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలని స్కెచ్ వేశారు. ఐటీ హబ్ బెంగళూరులో అయితే ఏదోఒక సమస్య వస్తుందని భయపడిన విదేశీయులు ఐటీ హబ్ కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని రామనగరలో మకాం వేశారు. పక్కా సమాచారంతో 7 మందిపోలీసులకు చిక్కిపోయారు.భారత్ లో పుట్టి పెరిగామని తప్పుడు పత్రాలు తయారు చేసి భారత ప్రభుత్వ అధికారుల దగ్గర ఆధార్ కార్డులు సంపాధించారు. గుట్టుచప్పుడు కాకుండా గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేసుకుంటూ భారతీయుల్లా చెలామణి అయిపోతున్నారు. రామనగరలో బాంగ్లాదేశీయులు అక్రమంగా తలదాచుకున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు..బంగ్లాదేశ్ కు చెందిన మోహమ్మద్ సోహిల్, జుల్పీకర్ ఆలీ, ఉజాల్ అహమ్మద్, మిన్సాజుల్ హుస్సేన్, ముస్సా షేక్, ఆరీవుల్లా ఇస్లాం అనే యువకులు తమిళనాడుకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించారు. పశ్చిమ బెంగాల్ నుంచి రైలులో బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులో సమస్యలు ఎదురౌతాయని భయపడిన నిందితులు రామనగర చేరుకున్నారు.పశ్చిమ బెంగాల్, అసోం, ఒడిశా రాష్ట్రాల్లో పుట్టి పెరిగామని ఈ 7 మంది నకిలీ పత్రాలు తయారు చేశారు. తప్పుడు పత్రాలు తయారు చేసి భారత ప్రభుత్వ అధికారుల దగ్గర ఆధార్ కార్డులు సంపాధించారు.గుట్టుచప్పుడు కాకుండా గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల్లో చేరిపోయారు. బంగ్లాదేశీయులు రామనగరలో తలదాచుకున్నారని కచ్చితమైన సమాచారం అందడంతో కర్ణాటక పోలీసులు 7 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Comments