బీజేపీ భరోసా యాత్ర..

 అక్షరవిజన్ న్యూస్.. తెలంగాణ.. ఈ నెల 21 నుంచి పల్లె ఘోస - బీజేపీ భరోసా పేరుతో యాత్ర చేపడుతున్నట్టు రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ యాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌కు బై.. బై.. చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శలు చేశారు. ఇక.. ఆగస్టు 2 నుంచి ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర ప్రారంభమవుతుందని తరుణ్‌చుగ్‌ తెలిపారు.

Comments