రైలు డీకొని గొర్రెలు మృతి..

అక్షరవిజన్ న్యూస్.. జగిత్యాల జిల్లా.. కోరుట్ల మండలం..

రైలు ఢీకొన్న ఘటనలో 82 గొర్రెలు మృతి చెందిన సంఘటన

కోరుట్ల మండలం చిన్న మెట్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చిన్న మెటపల్లి గ్రామానికి  చెందిన లక్కం రాజం రోజులాగే గొర్లను మేత కోసం తీసుకుపోగా గొర్లు రైల్వే ట్రాక్ మీద వెళ్లగా కరీంనగర్ టు నిజాంబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు వచ్చి గోర్లను ఢీ కొనడంతో సుమారు 82 గొర్రెలు అక్కడికక్కడే  మృతి చెందాయి. దీంతో సుమారు రూ 10 లక్షలు నష్టం జరిగిందని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. బాధిత కుటుంబాన్ని భాజపా నాయకురాలు తుల ఉమ పరామర్శించారు.

Comments