ఉగ్ర చర్య..

 అక్షరవిజన్ న్యూస్.. శ్రీనగర్..  జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. గాలింపు చర్యలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్‌లో ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో మంగళవారం ఒక పోలీస్ మరణించారు. మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. లాల్ బజార్‌లోని జిడి గోయెంకా స్కూల్ వెలుపల నాకా పార్టీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. పోలీసులు దాడులను తిప్పికొట్టిన ముష్కరుల తప్పించుకోగలిగారని వెల్లడించారు. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో భద్రతా దళాలు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి.

Comments