అక్షరవిజన్ న్యూస్.. హైద్రాబాద్.. టాలీవుడ్ ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా మంగళవారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణకు హాజరయ్యాడు. ఓ స్థలానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌లో గతంలో రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల మేరకు మంగళవారం రానా కోర్టు విచారణకు హాజరయ్యాడు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది... హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ పరిధిలో ఓ స్థలాన్ని 2014లో ఓ సంస్థ లీజుకు తీసుకుంది. అయితే సదరు సంస్థ యజమాని కుమారుడు ఆ స్థలాన్ని దగ్గుబాటి రానా పేరిట రిజిస్టర్ చేసినట్లుగా కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.
కోర్టుకు హాజరు...