3 రోజులపాటు సెలవులు..

అక్షరవిజన్ న్యూస్.. హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు . అన్ని విద్యా సంస్థలకు రేపట్నుంచి మూడు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు . ఈ మేరకు రాష్ట్రంలోని వర్షాల పరిస్థితిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు . ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు, సీఎస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు .

Comments