[సింహాచలం - విజినిగిరి కాలనీ] కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కులవృత్తి పనులు చేసుకోలేని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. శ్రీ మారుతీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సింహాచలం 98 వ వార్డు విజినిగిరి కాలనీ లో నివసిస్తున్న 65 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో వచ్చిన ఈ యొక్క కరోనా వైరస్ మహమ్మారి వలన కులవృత్తులకు వెళ్లలేని పేదలకు సమితి ఆధ్వర్యంలో అనేక రకాలుగా చేయూతను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ యొక్క మహమ్మారి నుండి త్వరగా విముక్తి కలగాలని సింహాద్రి అప్పన్న స్వామి ని ప్రార్థిస్తున్నాము అని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ సభ్యులు త్రినాధ్, సూర్యనారాయణ, సత్యనారాయణ, సాయి, అప్పన్న, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
[సింహాచలం] శ్రీ మారుతీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ