బాణసంచా పంపిణి..

         

  జర్నలిస్టులే సమాజానికి మార్గదర్శకులు..

విశాఖ పశ్చిమ వైసీపీ కో`ఆర్డినేటర్‌ ఆడారి ఆనంద్‌ కుమార్


        ఘనంగా వీజేఎఫ్ సభ్యులకు దీపావళి బాణసంచా పంపిణీ.. 

విశాఖపట్నం, నవంబర్‌ 13, అక్షరవిజన్ న్యూస్ : సమాజాన్ని నిర్దేశించేంది జర్నలిస్టులేనని, జరిగేది , జరుగుతున్నదీ, జరగబోయేది వారే చెబుతుంటారని సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌, విశాఖ పశ్చిమ వైసీపీ కో`ఆర్డినేటర్‌, విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. తాను నిత్యం జర్నలిస్టులతో మాట్లాడి విశేషాలు తెలుసుకుంటానని, ఎలమంచిలిలోని జర్నలిస్టుల్ని పలకరిస్తూ ఏం జరుగుతోందని అడుగుతుంటానన్నారు.   ఆదివారం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన వైజాగ్‌ జర్నలిస్ట్‌ ఫోరం (వీజేఎఫ్‌) సభ్యులు, విశాఖ పశ్చిమ నియోజకవర్గ జర్నలిస్టులకు బాణసంచా పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తోటి జర్నలిస్టుల అభివృద్ధిని కాంక్షిస్తూ తక్కువ సమయంలోనే ఇలాంటి  కార్యక్రమాల్ని నిర్వహించిన ఫోరం సీనియర్‌ సభ్యుల్ని ఆయన అభినందించారు. జర్నలిస్టుల కుటుంబాలకు తన వంతుగా చిరు కానుకను అందించే అవకాశాన్ని కల్పించి, తనను భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవ అతిథిగా విచ్చేసిన  మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ బాణసంచా పంపిణీ చేసి పండగను ఆనందంగా జరుపుకోవడానికి ఆనంద్‌ చేసిన కృషిని కొనియాడారు.  సీఎం జగన్‌ చొరవతో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు ఆనందంగా ఉన్నాయన్నారు. జీవీఎంసీ పరిధిలో తాము చేపడుతున్న కాలుష్య నియంత్రణ వంటి కార్యక్రమాల్ని జర్నలిస్టులే ప్రపంచానికి తెలియజేస్తున్నారని, అందువల్లే విశాఖ అభివృద్ధి సూచిక పైపైకి ఎగబాకుతోందన్నారు. జర్నలిస్టు నేతలు మాట్లాడుతూ ఏటా దీపావళికి వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో బాణసంచా పంపిణీ జరుగుతోందని, వీజేఎఫ్‌ పాలకవర్గం లేనప్పటికీ జర్నలిస్టులకు మేలు జరిగే ఏ కార్యక్రమం నిలిచిపోకూడదనే ఆలోచనతో ఆడారి ఆనంద్‌ను సంప్రదించామన్నారు. ఆయన కూడా అందుకు సరేనని ముందుకు రావడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులకు మిఠాయిలతో పాటు బాణసంచా సామాగ్రి పంపిణీ చేసేందుకు జర్నలిస్టుల కుటుంబాల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జర్నలిస్ట్‌ నాయకులు ఆర్‌. రామచంద్రరావు, బి.రవికాంత్‌, మనభూమి సత్యనారాయణ, ధవళేశ్వరం రవికుమార్‌, జి.శ్రీనివాసరావు, కొయిలాడ పరశురాం, బొప్పన రమేష్‌, రామకృష్ణ, చందు, యు.వి.భాస్కరరావు, ఎస్‌వీబీ కుమార్‌, త్రినాథ్‌,  సుంకరి సూర్యం, బాలు,కోటి, మౌలానా,బంటయ్య ,చంద్రమోహన్, గ్రేటర్ శ్రీనివాస్ , రాజేష్,మహేష్, ప్రసాద్ తదితరులు అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

బ్యూరో చీఫ్:- డి ఎస్ ఎన్ మూర్తి.

Comments