*విశాఖలో అట్టహాసంగా cosmediQ నూతన బ్రాంచి ప్రారంభోత్సవం*
సంస్ధ ఫౌండర్ Dr. తేజా వినోద్.
అక్షరవిజన్ న్యూస్ -: అత్యాధునిక నూతన టెక్నాలజీతో చర్మం, హైర్ ట్రాన్స్సే లెంట్ క్లినిక్ సేవలు విశాఖలో అందుబాటులోకి వచ్చాయి.నగరంలో రామ్ నగర్, విశాఖలో అత్యాధునిక టెక్నాలజీ, సకల సదుపాయాలతో ఏర్పాటు చేసిన cosmediQ నూతన బ్రాంచిను సంస్ధ ఫౌండర్ తేజా వినోద్ ప్రారంభం అయినట్లు తెలిపారు .9 సంవత్సరాలకు పైగా డెర్మటాలజీలో అనుభవం ఉన్న సంస్థ ఫౌండర్ డాక్టర్ తేజ వినోద్ ఆధ్వర్యంలో కాస్మెడిక్ - స్కిన్ & హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ ౩వ బ్రాంచ్ ని రామ్ నగర్ లో ఘనంగా ప్రారంభించారు.కాస్మెడిక్ ను ప్రారంభించి కేవలం మూడేళ్ళ కాలం వ్యవధిలోనే 3 బ్రాంచిలను ప్రారంభించి 5000 కు పైగా పేషెంట్స్ తమ జీవితాల్లో స్కిన్ & హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ సేవలను అందించారు.ఇప్పటికే మధురవాడ, గోపాలపట్నం బ్రాంచ్ లతో పాటు ఇప్పుడు కొత్తగా రాంనగర్ లో బ్రాంచ్ ద్వారా మరింత మంది ప్రజలకు ఈ సంస్థ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఈ సందర్బంగా సంస్ధ ఫౌండర్ Dr. తేజా వినోద్ చేప్పారు. దేశం లో ప్రసిద్ధి చెందిన జిప్మర్ కళాశాల నుంచి డెర్మటాలజీ లో స్పెషలైజేషన్ చేసి ఉత్తీర్ణులయిన డాక్టర్ తేజ వినోద్, కాస్మెడిక్ ని స్థాపించి పేషెంట్స్ కి సేవలను అందిస్తూ తమ తోటి డాక్టర్స్ కు, కొత్తగా పట్టాలు పొందిన డెర్మటాలజిస్ట్స్ కి ట్రైనింగ్ కూడా అందిస్తున్నారు.అతి సాధారణ ధరలతో అన్ని సేవలను ప్రజలకి అందిస్తూ, 3వ శాఖను రామ్‌నగర్‌లో ప్రారంభించడం ద్వారా కాస్మెడిక్ ఒక కొత్త మైలురాయిని చేరుకుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ Dr. అవంతి, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ శ్రావ్య కృష్ణ, ఫుడ్ & న్యూట్రిషన్ సింధూర పంచకర్ల తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్:- రాజు