శ్రీ సీతారాముల కళ్యాణ నిర్వహణకు కోటి రూపాయలు :

 

 శ్రీ సీతారాముల కళ్యాణ నిర్వహణకు కోటి రూపాయలు : 


28-03-23,తెలంగాణ, హైదరాబాద్, అక్షరవిజన్ న్యూస్ :-  శ్రీరామ నవమి సందర్భంగా ఈనెల 30 న భధ్రాచలంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 1 కోటి రూపాయలను సిఎం కేసీఆర్ మంజూరు చేశారు. కరోనా కారణంగా  గత రెండు సంవత్సరాలుగా, భధ్రాచల దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో, దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కళ్యాణ నిర్వహణకోసం సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సిఎం అధికారులను ఆదేశించారు.

బ్యూరో చీఫ్ :-  డీ ఎస్ ఎన్ మూర్తి 

Comments