అప్పన్నను దర్శించుకున్న రాష్ర్ట మంత్రి ఆర్కే రోజా

అప్పన్నను దర్శించుకున్న రాష్ర్ట మంత్రి ఆర్కే రోజా...

సింహాచలం, అక్షరవిజన్ న్యూస్ -:  శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారిని టూరిజం శాఖా మంత్రి అర్ కె రోజా దర్శించుకున్నారు. రాజ గోపురం వద్ద ఈఓ వేండ్ర త్రినాధ్ రావు, స్వామి వారి శేష వస్త్రంతో ఘన స్వాగతం పలికారు. ట్రస్టీలు వారణాసి దినేష్ రాజ్, సంపంగి శ్రీనివాస రావు మరియు అధికారులు. గరుడాల్వార్ వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికేరు. అనంతరం కప్పస్తంబాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయం నందు స్వామి వారిని, అమ్మ వారిని సేవించుకున్నారు. మంత్రివర్యులు కు బేడా మండపంలో ఆశీర్వచనం పఠించిన అర్చకులు,వేద పండితులు , స్వామి వారి జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ మరియు ట్రస్టీలు, తీర్థ ప్రసాదాలు అందచేసారు. ఆలయ అధికారులు, "ఆనంద నిలయం" నందు ప్రసాద్ స్కీమ్ ద్వారా మంజూరు అయిన వివిధ అభివృద్ధి పనులుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఏపీ టూరిజం అధికారులు  కేంద్రం ప్రసాద్ స్కీమ్ ద్వారా అనుమతులు ఇచ్చిన అంశాలపై మీడియా ముందు ప్రదర్శించారు. మంత్రి రోజా మాట్లాడుతూ  ఒక నెల రోజుల లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని      చేప్పారు."ప్రసాద్ స్కీమ్" రెండు సంవత్సరాలు లోపు పూర్తి చేసి భక్తులకు అందిస్తామని తెలియ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి  వై యస్ జగన్మోహన్ రెడ్డి గారిని శంఖుస్థాపనకు ఆహ్వానిస్తామని తెలిపారు. 

మొత్తం ఏభయి నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయలుతో త్వరలో "ప్రసాద్ స్కీమ్" టెండర్లు పిలిచి శంఖుస్థాపన చేయడానికి టూరిజం శాఖ ప్రణాళికలు రూపొందించామని విలేకరుల కు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు శ్రీమతి వరుదు కల్యాణి, ఈఈ శ్రీనివాస రాజు, రాంబాబు, ఆలయ అధికారులు నరసింహ రాజు, పీఅర్ఓ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు వివరాలు:-

1. నాలుగు కోట్ల డెబ్బది ఎనిమిది లక్షల రూపాయలుతో యాత్రికుల సౌకర్యార్థం పాత పుష్కరిణీ చౌల్ట్రీ రెండు బ్లాకుల్లో రెండు అంతస్తులు నిర్మాణం (ఒక ఫ్లోర్ 500 Sqm)

2. అయిదు కోట్ల నలబై లక్షలుతో కొత్త టోల్ గేట్ ఘాట్ రోడ్డు వద్ద 4 ఎకరాలు అభివృధి బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్, ప్రహరీ గోడ, టాయిలెట్, మంచినీరు, నాలుగు బస్సు షెల్టర్లు, ఫుడ్ కోర్టులు ఆరు షాపులు నిర్మాణం.

3. మూడు కోట్ల ఏబై నాలుగు లక్షలతో ఓల్డ్ ఎంట్రన్స్ ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం అభివృద్ధి సుమారు 1200 మెట్లు.

4. ఏడు కోట్ల డెబ్బది లక్షలతో క్యూ లైను కాంప్లెక్స్ నిర్మాణం, మెట్లు, పార్కింగ్, యాగశాల, ఎలివేటర్, ఆధునిక సాంకేతికతతో వంట శాల అభివృద్ధి, 500 మంది యాత్రికులు కూచునే విధంగా అంఫీథియేటర్.

5. అరవై మూడు లక్షలతో షటిల్ బస్ స్టాప్ నాలుగు బస్ షెల్టర్, రెండు ఛార్జింగ్ స్టేషన్లు, సీటింగ్ బెంచీలు.

6. మూడు కోట్ల నలబై ఆరు లక్షలతో టూరిస్ట్ ఇన్ఫో, ఫుడ్ కోర్టులు, సోలార్ పవర్ ప్లాంట్.

7.  పదకొండు కోట్ల అరవై ఎనిమిది లక్షలతో దర్శనం కొరకు యాత్రికుల వేచి ఉండు హాల్ (జి+1 ఫ్లోర్), రిటైనింగ్ వాల్ స్ట్రక్చర్.

8. అయిదు కోట్ల అరవై రెండు లక్షలతో కొండపై ఉన్న షాపుల స్థానంలో నూతనంగా మల్టీ లెవెల్ షాపుల నిర్మాణం.

9. ఎనబై ఒక్క లక్షలతో కూరగాయలు నిలువ చేసుకొనుటకు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం. 

10. మూడు కోట్ల డెబ్బయి అయిదు లక్షలతో పాన్ ఏరియా డెవలప్మెంట్, ఆరు నంబర్ల పద్నాలుగు సీట్ల ఎలక్ట్రిక్ మినీ వాన్లు, డిజిటల్ సూచికలు, బాగేజి స్క్రీనింగ్, సెక్యూరిటీ సిస్టమ్ మెటల్ డిటెక్టర్, మల్టీ మీడియా సెంటర్.

బ్యూరో చీఫ్ :- డీ ఎస్ ఎన్ మూర్తి

Comments