''రాష్ట్రం లో శ్రీ స్వామినారాయణ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ త్వరలో ఏర్పాటు..''
28.03.2023 అమరావతి, అక్షరవిజన్ న్యూస్ -:
ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు, ప్రతినిధులు...
---------
శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు,సుఖ్ వల్లభ స్వామి ప్రతినిధులు బృందం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం లో ట్రస్ట్ సభ్యులు సీఎం తో మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో తమ ట్రస్ట్కుకు 100 ఎకరాల భూమిని కేటాయించడంలో తోడ్పడ్డారు అని, అందువల్ల అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వామినారాయణ్ గురుకుల్ యూనివర్శిటీని ఏర్పాటుచేసి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు సీఎంకి వివరించామన్నారు. అలాగే రాష్ట్రం లో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి తగిన వసతులు కల్పించాలని కోరేమన్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతినిధులతో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్నాయన్న సీఎం..తమ ప్రభుత్వం తరుపున
ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు అని కార్యక్రమం లో పాల్గొన్న ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి అనుసరిస్తున్న పారదర్శక విధానాలు అందుబాటులో చాలా ఉన్నాయని సీఎం వివరించేనన్నారు . తమ ట్రస్ట్ కు ఏపీ, టీఎస్ పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, న్యూఢిల్లీ, గుజరాత్, ఛత్తీస్ఘఘడ్ ,UK,US, కెనడ, ఆస్ట్రేలియా ల లో 52 విద్యా సంస్థలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రం లో తమ స్కూల్స్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు సీఎం అంగీకారం తెలిపినందుకు కృతజ్ఞతలు తేలియజేసమన్నారు. వెనువెంటనే ప్రభుత్వ వెబ్సైట్ లో పొందుపర్చడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో విజయవాడ బ్రాంచ్ హెడ్ మంత్ర స్వరూప్ స్వామి, ట్రస్టు సభ్యులు శ్రవణ్ ప్రియ్ స్వామి, విష్ణువర్ధన్ స్వామి, ఎం ఎల్ ఏ మల్లాదివిష్ణు మాజీ మంత్రి జలగం ప్రసాదరావు , తదితరులు పాల్గొన్నారు.
బ్యూరో చీఫ్:- డీ ఎస్ ఎన్ మూర్తి.