కోవిడ్ పాజటివ్..

  అక్షరవిజన్ న్యూస్.. చెన్నై.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కొవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయారు. సీఎం స్టాలిన్‌ అలసట, జ్వరంతో బాధపడుతున్నారని, ఆయ‌నకు కొవిడ్ ప‌రీక్ష‌లు చేయగా క‌రోనా పాజిటివ్గా తేలిందని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.రాష్ట్ర ప్రజలంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధరించాలని, టీకాలు వేయించుకోవాలని సీఎం స్టాలిన్ విజ్ఞ‌ప్తి చేశారు. అంద‌రూ సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ కూడా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అన్నిచోట్ల‌ క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలని ఆదేశించింది.

Comments