జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రతిభా పురస్కారాలు..ప్రతిభకు ప్రోత్సాహం పేరిట అవార్డులు..

అక్షరవిజన్ న్యూస్.. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సభ్యులు పిల్లలకు మెరిట్ స్కాలర్ షిప్స్ అందజేయనున్నట్లు ఫోరం అధ్యక్షులు, స్కాలర్ షిప్స్ కమిటీ చైర్మన్ గంట్ల శ్రీనుబాబు తెలిపారు.. శుక్రవారం ఇక్కడ డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ..ఎల్ కేజీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టేట్,సీబీఎస్ఈ సిలబస్ లకు సంబంధించి స్కాలర్ షిప్స్ అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ లో ప్రతిభ కనబర్చిన ఒకరిద్దరు విద్యార్థులను కూడా గుర్తించి వారికి కూడా ప్రత్యేక అవార్డులు అందజేస్తామన్నారు. కావున జర్నలిస్టుల పిల్లలు సంబంధిత మార్కుల జాబితా, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, పూర్తిచేసిన దరఖాస్తుతో కలిపి వచ్చే నెల 5వ తేదీలోగా ప్రెస్ క్లబ్ కార్యాలయం పనివేళల్లో అందజేయాలన్నారు. అదేవిధంగా త్వరలో ప్రతిభకు ప్రోత్సాహం పేరిట మీడియా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు అవార్డు ల  కమిటీ చైర్మన్ ఆర్ నాగరాజు పట్నాయక్ తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామన్నారు. ఆగస్టులో ఆయా కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మెరిట్ స్కాలర్ షిప్ లకు, అవార్డుల కమిటీకి సంబంధించి ఉపాధ్యక్షులు నానాజీ, జాయింట్ సెక్రటరీ (ఇంఛార్జి కార్యదర్శి) దాడి రవికుమార్,కోశాధికారి పి ఎన్ మూర్తి,పలువురు  కార్యవర్గ సభ్యులు కో చైర్మన్ లుగా వ్యవహరిస్తారన్నారు.. నార్ల వెంకటేశ్వరరావు భవన్ (విజేఫ్, వినోద వేదిక) మరమ్మ త్తులు త్వరలోనే పూర్తి చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని శ్రీను బాబు తెలిపారు. ఈ సమావేశములో కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, ఎమ్మెస్సార్ ప్రసాదు, పైలా దివాకర్, డేవిడ్, పి. వరలక్ష్మ ,దొండ గిరిబాబు, సనపల మాధవ్, శేఖర మంత్రి , గయాజ్ తదితరులు పాల్గొన్నారు.

Comments