అక్షరవిజన్ న్యూస్.. గుజరాత్ ముంద్రా ఓడరేవు సమీపంలోని కంటైనర్‌లో రూ.376.50 కోట్ల విలువైన 75.3 కిలోల హెరాయిన్‌ను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. అధికారులను తప్పుదోవ పట్టించేందుకు దుండగులు ఫాబ్రిక్ రోల్స్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేసే ప్రయత్నం చేశారు. ఫాబ్రిక్ రోల్స్‌లో చిన్నపాటి ఖాళీలను సృష్టించి అందులోకి హెరాయిన్‌ను నింపారని గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా వెల్లడించారు.అంతేకాదు.. X-RAYలో సైతం బయటపడకుండా కార్బన్ టేపులతో ఫాబ్రిక్ రోల్స్‌ను దుండగులు మూసివేశారని పోలీసులు పేర్కొన్నారు. రెండు నెలల కింద ముంద్రా ఓడరేవుకు వచ్చిన ఓ కంటైనర్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న పంజాబ్ పోలీసులు గుజరాత్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గుజరాత్, పంజాబ్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దొరికిన డ్రగ్స్ యూఏఈ నుంచి వచ్చాయి. పంజాబ్‌కు రవాణా చేయడానికి సిద్ధంగా ఉండగా పట్టుబడ్డాయి.
హేరాయిన్ పట్టివేత..