వరద ముంపు లో చిక్కుకున్న జర్నలిస్టులు

  అక్షరవిజన్ న్యూస్.. నిర్మల్ జిల్లా.. గిరిజన కూలీలు వరదలో చిక్కుకున్న న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులు ప్రమాదంలో చిక్కుకున్నారు. రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన 9 మంది కూలీలు కుర్రులో పత్తి ఏరేందుకు వెళ్లి జలదిగ్భందనంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా యంత్రాంగం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కేంద్రంగా మంగళవారం సాయంత్రం నుండి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూలీలను కాపాడే న్యూస్ కవర్ చేసేందుకు జగిత్యాలకు చెందిన ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఓ కారులో బయలు దేరారు. వీరు రాయికల్ మండలం రామోజీపేట, భూపతిపూర్ గ్రామాల మధ్యలో ఉన్న కల్వర్ట్ దాటుతుండగా వాగులో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో కారు కొట్టుకపోయింది. ఇందులో ఉన్న ఓ జర్నలిస్ట్ ప్రాణాపాయం నుండి తప్పించుకుని రామోజీపేటకు చేరుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న స్థానికులు కారు కోసం గాలింపు ముమ్మరం చేశారు. అయితే కారు అందులో ప్రయాణిస్తున్న జమీర్ ఎన్టీవీ రిపోర్టర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. జిల్లా అధికార యంత్రాంగం కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు సమాయత్తం అయింది.

Comments