(అక్షరవిజన్ న్యూస్) తెలంగాణ, జడ్చర్ల నియోజకవర్గం:- నవాపేట మండల పరిధిలో చౌడూరు గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించిన బిజెపి నాయకురాలు బాల త్రిపుర సుందరి గారు, గ్రామ బిజెపి అధ్యక్షులు రఘురాం గౌడ్ అనంతరము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను చూసి యువకులు పెద్ద ఎత్తున బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా బాల త్రిపుర సుందరి గారు యువకులు, బీఎస్పీ , పార్టీ టిఆర్ఎస్ పార్టీ నుండి 30 మంది నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంద్భంగా బాల త్రిపుర సుందరి గారు మాట్లాడుతూ కేవలం పార్టీలో చేరితే సరిపోదని పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.పార్టీని నమ్ముకొని కష్టపడి పని చేసిన వారికి ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందన్నారు. కుటుంబ పాలన అంతం అందించే రోజులు త్వరలోనే రానున్నాయి అని అన్నారు. పార్టీ చేరికలు చౌడూరు నుంచే మొదలవుతాయి అని చేప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కోశాధికారి బాలస్వామి, బిజెపి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాహితి రెడ్డి, మండల అధ్యక్షులు రాజు, యాదయ్య, శ్రీనివాస్, కమలాకర్ ,శ్రీశైలం గౌడ్, నరసింహులు, మల్లేష్ యాదవ్, రఘురాం గౌడ, ఊళ్ళ రాజు, గౌతమ్ గౌడ్ ,సాయి గౌడ్, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ లోకి భారీ వలసలు..