అక్షరవిజన్ న్యూస్..విశాఖపట్నం.. జూలై 13 2022 .భీమిలి బీచ్ రోడ్ లో గల చిన్న జీయర్ స్వామివారి వారిజ ఆశ్రమం లో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. బుధవారం విశాఖ సాగర తీరంలోని మంగమారిపేటలో గల చిన్న జీయర్ స్వామి వారి వేద పాఠశాల ప్రాంగణంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ హయగ్రీవ మందిరంలో ఆచార్య వందనం చేపట్టారు.
శ్రీ త్రిదండి దేవనాధ జీయర్ స్వామి వారి నిర్వహణ లో జగదాచార్యులు,. అపర రామానుజులు త్రిదండి చిన్న జీయర్ స్వామివారి పాదుకలకు ఆరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ గురు పౌర్ణమి ఒక మంచి ఆలోచన విధానాన్ని గురువు ద్వారా అందిస్తుందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి లక్షణాలు ఆలోచనలు కలిగి ఉండే విధంగా ఒక మార్గదర్శకాన్ని గురువు అందిస్తారన్నారు. సాధారణంగా చాతుర్మాస్య దీక్ష ప్రతి ఒక్కరూ నిర్వహించవచ్చని అయితే ప్రస్తుత కాలానుగుణంగా కేవలం యతీశ్వరులు సన్యాసులు పీఠాధిపతులు సమంత తప్పకుండా ఈ దీక్షను ఆచరిస్తున్నారన్నారు. వర్షాకాలం కారణంగా జీవచరాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సంధ్యా సమయం తర్వాత పాదయాత్ర కానీ పర్యటనలు గాని చెయ్యరాదు అన్నారు ఆహార నియమాలతో పాటు గ్రంథం పఠనం జరుగుతుందన్నారు.అంతకుముందు త్రిదండి శ్రీ
దేవనాధ రామానుజ జీయర్ స్వామివారు చాతుర్మాస్య దీక్ష స్వీకారం చేపట్టారు. ఈ వేడుకల్లో వారి వారీజ ఆశ్రమ వేద పండితులు ముడుంబయి శ్రీకాంత్ స్వామి సంతోష్ కుమార్ స్వామి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.