అక్షరవిజన్ న్యూస్.. హైదరాబాద్.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. బహదూర్‌పురాకు సమీపంలో ఉన్న మీరాలం చెరువుకు కూడా వరద పోటెత్తింది. చెరువు పక్కనే ఉన్న జూపార్కుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో జూపార్కులోని సఫారీ పార్కును అధికారులు మూసివేశారు. వరద నీరు తగ్గాక సందర్శకులను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కూడా నీటితో కళకళలాడుతున్నాయి.
జల కళ..