సింహగిరి కొండపై ఏర్పాట్లు..

  అక్షరవిజన్ న్యూస్.. విశాఖపట్నం.. సింహాచలం  శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 12 13 తేదీల్లో జరుగునున్న సింహగిరి ప్రదక్షణ ఆషాడ పున్నమి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున్ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీసా డిసిపి సుమిత్  బృందము బుధవారం సాయంత్రం పరిశీలించారు. దేవస్థానం ఈవో ఎం.వి సూర్యకళ ఈ ఈ శ్రీనివాసరాజు దేవస్థానం చేస్తున్న ఏర్పాటులను కలెక్టర్ బృందానికి వివరించారు ప్రదక్షణ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు సిద్ధం చేసి  ఈవో అధికారులకు చూపించారు. 35 కిలోమీటర్ల పొడవునా భక్తుల ప్రదక్షణ  యాత్ర మార్గాలలో ఎక్కడకక్కడ కీలకమైన ప్రదేశాలు ఉన్నాయో అధికారులు మ్యాపు ద్వారా పరిశీలించి ఒక అంచనాకు వచ్చారు. భక్తుల వాహనాల పార్కింగ్ ప్రదేశాలను నిర్దేశించుకున్నారు. బస్సు దిగి కాలినడకన భక్తులు తొలి పావంచాలు వద్ద  రాకపోకలు సాగించేందుకు వీలుగా చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు. పాత ఆడివివరం పాత గోసాల కూడలి నుంచి బారికేట్లు ఏర్పాటు చేసి ఇబ్బందులేకుండా చూడాలని కలెక్టర్ సి పి కి సూచించారు టెంకాయలు కొట్టేందుకు పదుల సంఖ్యలో కౌంటర్లు క్యూలు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో వివరించారు. పున్నమి నాడు సింహగిరిపై ఆలయ ప్రదక్షణ చేసే భక్తులు సంఖ్యను అధికారులు అడిగి తెలుసుకున్నారు.ఆరోజు వీఐపీల దర్శనాలు ఏమైనా ఉంటాయా అన్న విషయాలను కూడా కలెక్టర్ సిసి అడిగి తెలుసుకున్నారు. ప్రతి రెండు మూడు కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండేటట్లు చూడాలని సూచించారు .ఈ సందర్భంగా కలెక్టర్ సిపి   భక్తులంతా మాస్కులు ధరించాలని సూచించారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధము అమలులో ఉన్నందున భక్తులకు నీరు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ యాడాది పక్కా ప్రణాళికలతో ఏర్పాట్లు చేస్తున్నామని సిపి శ్రీకాంత్ వెల్లడించారు .2000 మంది పోలీసులు విధుల్లో ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు. భక్తుల స్నానాలు ఆచరించే జోడిగుడ్లపాలెం సముద్ర తీరంలో భద్రత మరింత కట్టు తిట్టం చేస్తున్నామని ఈతగాలను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. 10 ఏళ్లలోపు పిల్లలు వృద్దులు ప్రదక్షిణకి రాకపోవడమే మంచిదని సిపి సూచించారు. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకొని ప్రశాంతంగా ప్రదక్షిణ పూర్తి చేయాలని సిపి సూచించారు.

Comments