జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి కి ఏకగ్రీవంగా ఎన్నికైన సుంకర గిరిబాబు.. 

 విశాఖ దక్షిణం , అక్షరవిజన్ న్యూస్-: విశాఖ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా సుంకర గిరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు మూడు జిల్లాల కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి  గిరిబాబుకి జడ్పీ వైస్ చైర్మన్ పదవికి బీఫామ్ అందజేశారు. నేడు జరిగిన ఎన్నికల్లో ఆయన్ని జిల్లాపరిషత్ వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ పదవి విషయంలో సంపూర్ణ సహకారాలు అందించిన వై వి సుబ్బారెడ్డి కి, భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీనివాసరావుకి, ధన్యవాదాలు తెలియజేశారు. పదవి అనేది అధికారం గా కాకుండా ప్రజాసేవగా భావించి బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో , భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


బ్యూరో చీఫ్:- డి ఎస్ ఎన్ మూర్తి.

Comments