గంటపాటు 'కోలగట్ల' జలాసనాలు


                  నీటిలో యోగాసనం వేస్తున్న కోలగట్ల

 విజయనగరం అక్షరవిజన్ న్యూస్ : గంట పాటు నీటిపై తేలియాడుతూ... పలు యోగాసనాలు వేసి రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి(64) అందరినీ ఆకట్టుకున్నారు. జాతీయ స్విమ్మింగ్ పూల్ డేను పురస్కరిం చుకుని క్రీడారంగ విశిష్టత, స్విమ్మింగ్ సాధన, యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవ గాహన కల్పించడానికి విజయనగరంలోని కం టోన్మెంట్ ప్రాంతంలో ఉ న్న ఆక్వా స్విమ్మింగ్ పూల్లో మంగళవారం ఆయన కార్యక్రమం చేప ట్టారు. ఈ ప్రదర్శనను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుత దితరులు ప్రారంభించారు. నిర్విఘ్నంగా గంట పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం దేశ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముగించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కోలగట్లను సత్కరించారు.

బ్యూరో చీఫ్ -: డి ఎస్ ఎన్.

Comments