వి జె ఏఫ్ సమస్యకు త్వరలో పరిష్కారం.. 

                          జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున.

విశాఖపట్నం, అక్షరవిజన్ న్యూస్ -: విశాఖ జర్నలిస్టు ఫోరం నకు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విశాఖ జర్నలిస్ట్ ఫోరంనకు సంబంధించి ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు జర్నలిస్టులతో సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా విశాఖ జర్నలిస్ట్ ఫోరంనకు సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు ఎక్కౌంట్స్ నిర్వహణ లో సాంకేతికంగా అవకతవకలు జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపారు. కావున ఈ విషయమ పై రికార్డులను ఆడిట్ అధికారి పరిశీలించి పుర్తిస్తాయి రిపోర్ట్ అందజేయడం జరుగుతుందన్నారు. రేపు ప్రాధమిక ఆడిట్ రిపోర్ట్ విడుదల చేయబడును. పాత కార్యవర్గ సభ్యులకు ప్రస్తుతం అధికారాలు లేనందున, కొత్త కార్యవర్గం ఏర్పడింత వరకు విశాఖ జర్నలిస్ట్ ఫోరంనకు సంబంధించిన విషయాలను ఐదుగురు అధికారులతో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఆఫీసు తాళాలను రేపటి నుంచి అధికారులు కమిటికి అప్పజెప్పబడును మరియు ఆఫీసు సమయంలో దానిని తెరిచి మరియు ఇతర సమయలో ముసివేయబడును. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విశాఖ జర్నలిస్ట్ ఫోరం ఎన్నికలకు సంబంధించి కోర్ట్ కు సమర్పించిన సభ్యుల లిస్టు తో పాటు, కొత్తగా సభ్యత్వం కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను తయారు చేసి, హర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని తెలిపారు, తదుపరి వి జె ఎఫ్ కు ఎన్నికలను నిర్వహించడం. జరుగుతుందని తెలిపారు. త్వరలో విశాఖ జర్నలిస్ట్ ఫారంనకు ఎన్నికల నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నామని, జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరూ సహకరించి ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.

బ్యూరో చీఫ్-: డి ఎస్ ఎన్.

Comments