సభ్యులకు మెరుగైన సేవలు అందించాం.                                ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు.

అక్షరవిజన్ న్యూస్, డాబాగార్డన్స్ -: జర్నలిస్టుల ఫోరం  సభ్యులందరికీ  తమ కార్యవర్గం హయాంలో పారదర్శకమైన సేవలు అందించామని  ఫోరమ్ ప్రస్తుత అధ్యక్షుడు గంట్ల  శ్రీను బాబు పేర్కొన్నారు. గురువారము డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో  ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.  ఫోరం ఎన్నికల నిర్వహణ, సభ్యత్వ పరిశీలనతో పాటు పలు అంశాలను అధికారులకు తెలియ చేసా మన్నారు.. వందల మంది సభ్యులు ఉండగా కేవలము ఐదుగురు మాత్రం అర్దము పర్థం లేని విమర్శలు.. పిర్యాదులు చేశారని ఐతే వారికి ఇది అలవాటుగా మారిందని కొట్టి పారేశారు.. ప్రతీ ఎన్నికలకు ముందు వారికి ఇదే పనిగా పెట్టు కుంటారన్నారు.. ఆరోపణలు చేసే వారు తొలుత వారి సంఘాలు, వసూలు చేసిన మొత్తాలు విజెఎఫ్ సభ్యులకి చెప్పి విలీనం చెయ్యాలని కోరారు.. ఆయా కార్య క్రమాలు లో ఫోరమ్ కార్య దర్శి దాడి రవి కుమార్,వైస్ ప్రెసిడెంట్ అర్. నాగరాజ్ పట్నాయక్, కోశాధికారి పి. ఎన్ మూర్తి, కార్య వర్గ సభ్యులు ఇరోతి ఈశ్వర్ రావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, గిరి బాబు, డేవిడ్, సనపల మాధవరావు, శేఖర్ మంత్రి, గయాజ్, గిరిబాబు సీనియర్ పాత్రికేయులు హేమ సుందర్, కిల్లి ప్రకాష్ రావు, గంటా చంద్ర శేఖర్ తో పాటు భారీ గా జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

బ్యూరో చీఫ్ -: డి ఎస్ ఎస్.
Comments