*ఘనంగా సత్తమ్మ తల్లి.. మరిడి మాంబ అమ్మవారి వార్షిక పండగ*

*శాస్త్రోక్తము గా భక్తులు పసుపు కుంకుమలు సమర్పణ*.

అక్షరవిజన్ న్యూస్ , సింహాచలం-: అప్పన్నసోదరి. అడవివరం.. శ్రీనివాస్ నగర్ పరిసర 14 గ్రామాల ప్రజల పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న శ్రీ సత్తమ్మ తల్లి, మరిడిమాంబ అమ్మవారి పండగ మహోత్సవం. ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రధాన పండుగను ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించనుండగా వార్షిక జాతరను క్రమం తప్పకుండా ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ ఈనెల 13 నిర్వహించనున్న నేపథ్యంలో ఆదివారం సత్తమ్మ తల్లి . మరిడి మాంబ వార్షిక పండుగ వైభవోవేతంగా జరిపించారు. తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాత సేవ తో మేలు కొలిపి, ఆరాధన కావించారు. అనంతరం భక్తులందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. పరిసర ప్రాంతాల కు చెందిన పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. ముడుపులు,.మొక్కుబడులు, చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు. వ్యవస్థాపక అధ్యక్షులు పి వెంకట్రావు,కార్యదర్శి గంట్ల కనకరాజు, జాయింట్ సెక్రెటరీ బలి రెడ్డి శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు, భక్తులుకు ఎటువంటి ఇబ్బందులు కలపకుండా అన్ని సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు అన్న ప్రసాద వితరణ గావించారు. ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. వార్షిక జాతర నేపథ్యంలో. సమీప ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సతివాడ శంకర్ రావు. గంట్ల కిరణ్ బాబు.అప్పన్న.. తాత బాబు, బంటి తో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బ్యూరో చీఫ్:- డి ఎస్ ఎన్.

Comments